కన్నడనాట పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అతి చిన్న వయసులోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించి అతనికి వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.అతి చిన్నవయసులోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న పునీత్ మరణం ఇండస్ట్రీకి తీరని విషాదంగా మారింది. ఈ క్రమంలోని ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం ముందుగా హైఅలర్ట్ విధించింది.ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన చివరి పోస్ట్ ఏంటి అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం పునీత్ హోంబలే బ్యానర్‌లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా ఇన్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పునీత్ భజిరంగి-2 టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ చివరి ట్వీట్ చేశారు. ఇందులో కథానాయకుడిగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Best wishes for the entire team of #Bhajarangi2. @NimmaShivanna @NimmaAHarsha @JayannaFilms
— Puneeth Rajkumar (@PuneethRajkumar) October 29, 2021
ఈయన మరణాంతరం అతని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసినట్లు ప్రకటించారు. స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న పునీత్ మృతదేహాన్ని ప్రేక్షకుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తరలించారు ఈయన మృతదేహాన్ని సందర్శించిన కేజిఎఫ్ హీరో యష్ తన పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
































