Akash Puri: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు డైరెక్టర్ గా మాత్రమే ఉన్నటువంటి పూరి ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలసి సినిమాలను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇద్దరు కలిసే కూడా ముంబైలో నివసించడం అదేవిధంగా ఇద్దరు కలిసి పలు పార్టీలకు హాజరవుతూ కనిపించడంతో గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ వార్తలు రావడమే కాకుండా ఛార్మి కోసం పూరి జగన్నాథ్ విడాకులిచ్చాడని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ..నాన్న తన సినీ కెరీర్లో ఎంతో నష్టపోయాడు అయితే అమ్మ ఆ పరిస్థితులను అర్థం చేసుకుని ఈ విషయాలు మాకు తెలియకుండా మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు.
నాన్న ఇబ్బంది పడుతున్న సమయంలో అమ్మ నాన్నకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ సమయంలో ఇల్లు కార్లు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మా ఫ్యామిలీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం అమ్మే. మా అమ్మ నాన్నల విడాకుల గురించి తాను ఇప్పటివరకు ఒక్క సారి కూడా వినలేదని,పని పాట లేని వాళ్ళు ఇలాంటి వార్తలు సృష్టిస్తూ ఉంటారని ఆకాశ్ తన తండ్రి గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.
నిజం చెప్పాలంటే అమ్మానాన్నలది ఇద్దరిదీ ప్రేమ వివాహం.నాన్న ఒక రోజు ఫోన్ చేసి తనని పెళ్లి చేసుకుంటావా అడిగినప్పుడు అమ్మ తనతో పాటు వచ్చిందని,తన జోబులో కేవలం 200 మాత్రమే ఉన్నాయి రేపు ఎలా ఉంటుందో తెలియదు అని నాన్న చెప్పిన అవన్నీ ఆలోచించకుండా అమ్మ తనతో పాటు వచ్చి తనని పెళ్లి చేసుకుందని వారిద్దరి మధ్య అంత ప్రేమ ఉందని ఆకాష్ ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ వారి గురించి వస్తున్న విడాకుల ఈ వార్తలపై స్పందించారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…