Pavithra Lokesh: పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు.. తన మొదటి భర్తకు ఈమె మొదటి భార్య కాదా?
Pavithra Lokesh: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినపడుతున్న పేర్లలో నటి పవిత్ర లోకేష్ పేరు ఒకటి.ఈమె గత కొంత కాలం నుంచి సీనియర్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తోందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది.
నరేష్ పవిత్ర లోకేష్ కలిసి పలు సినిమాలలో నటించడం తో వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడి సహజీవనానికి దారితీసిందని తెలుస్తోంది.వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఈ జంట ఇంతవరకు ఏమాత్రం స్పందించలేదు. అదే విధంగా తాజాగా వీరిద్దరు మహాబలేశ్వరంలో జంటగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వీరిద్దరికీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నటి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు ఆయన ఏం చేస్తుంటారనే విషయాల గురించి చర్చనీయాంశంగా మారింది. పవిత్ర లోకేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె తండ్రి కూడా మంచి నటుడే.అయితే ఈమె 9 వ తరగతిలో ఉన్న సమయంలో తండ్రి చనిపోవడంతో ఈమె కూడా కొద్ది రోజుల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ విధంగా కన్నడ సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈమె సుమారు 20 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించారు. ఈ విధంగా సీరియల్స్ చేస్తున్న సమయంలో కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్రతో ప్రేమలో పడిన పవిత్ర తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. అయితే సుచేంద్రకు పవిత్ర మొదటి భార్య కాదు ఈయన 2002వ సంవత్సరంలో కన్నడ నటి మల్లికా ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు.2006 లో తనకు విడాకులు ఇచ్చి 2007వ సంవత్సరంలో పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల వీరిద్దరూ విడిపోయారు.అయితే ఇప్పటికీ ఈమెకు అధికారికంగా విడాకులు రాకపోవడంతో నటుడు నరేష్ ను పెళ్లి చేసుకోకుండా ఉన్నారని విడాకులు వచ్చిన అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినపడుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…