Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు రాజకీయాల పరంగా కూడా విమర్శలు వచ్చాయి. ఈ సినిమాని ఎలాగైనా అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నాలు చేశారు అయితే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైకాపాకు మద్దతు తెలపడంతో ఇప్పుడు వైకాపా అభిమానులు కూడా అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ పరోక్షంగా రాజకీయ నాయకులను ఉద్దేశించే పెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే స్నేహితుడి గురించి ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పే ఓ డైలాగు ప్రస్తుతం వైరల్ అవుతుంది.కేశవ నా స్నేహితుడు. నా స్నేహితుడి కోసం నేను వస్తాను దానికి అడ్డు నువ్వు వచ్చిన నీ బాబు వచ్చినా మీ బాబాయ్ వచ్చిన… నన్నేం పీకలేరు. అంటూ పుష్ప క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించేలా ఉందని చెప్పాలి.
ఇక ఈ డైలాగు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి వారిని ఉద్దేశించే పెట్టారని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడి కోసం పవన్ కళ్యాణ్ కి కాకుండా శిల్పా రవికి మద్దతు తెలపడం కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు ఆ సమయంలో అల్లు అర్జున్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి అయితే పవన్ కళ్యాణ్ నాగబాబు అలాగే మెగా అభిమానులకు కౌంటర్ ఇచ్చే విధంగానే ఈ డైలాగ్ పెట్టారంటూ ప్రస్తుతం ఈ డైలాగును వైరల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…