Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ సినిమాని అడ్డుకోవడానికి కొంతమంది ప్లాన్ చేస్తున్నారంటూ వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గతంలో ఎన్టీఆర్ నటించిన సినిమాని కూడా అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని అడ్డుకోవాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప సినిమాని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. పుష్ప అంటే ఇంటర్నేషనల్ స్టార్ అని ఈయన గుర్తు చేశారు. పుష్ప సినిమాని చూసి కొంతమంది చాలా జలసీగా ఫీల్ అవుతున్నారని అందుకే ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని ఈయన తెలిపారు.
ఎన్టీఆర్ సినిమాని నందమూరి కుటుంబం అడ్డుకోవాలని చూసిన ఆ సినిమాని చూడకుండా ఎవరు ఆపలేకపోయారు. ఇప్పుడు కూడా పుష్ప సినిమాని చూడకుండా ఎవరు అడ్డుకోలేరు అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలాగైతే ఆపలేమో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని కూడా ఎవరు అడ్డుకోలేరని ఈయన తెలిపారు.
ఇక గత కొంతకాలంగా మెగా అభిమానులు అల్లు అర్జున్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పుష్ప సినిమాని సక్సెస్ చేయమని ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారానికి మొదలుపెట్టారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అంబంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల పరంగా తీవ్రమైన చర్చలకు కారణం అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…