Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్న ఇంకా ఈ సినిమా క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.
తాజాగా దసరా పండుగ సందర్భంగా అమెరికాలోని తెలుగు సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ వెళ్లారు. అయితే అక్కడ తెలుగు సంఘం నేతలు సమక్షంలో బతుకమ్మ సంబరాలు దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి అమెరికా మేయర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ వేడుకలలో భాగంగా మేయర్ తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ తో పాటు సిగ్నేచర్ మూమెంట్ చేయడంతో ఒక్కసారిగా వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని మేయర్ ఆఫీసర్ ద్వారా వెల్లడించడంతో ఈ వీడియో పై చిత్ర బృందం స్పందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పుష్ప టీమ్ స్పందిస్తూ భారతీయ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసినందుకు యాంకర్ అనసూయ, మంగ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే పుష్ప సినిమా మంచి విజయం అందుకోవడంతో త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ పనులను జరుపుకొనుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…