Unstoppable 2:బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడంతో ఈ కార్యక్రమానికి సెకండ్ సీజన్ అంతకుమించి ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమం అక్టోబర్ 14వ తేదీ ప్రారంభం కానున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
ప్రోమోలో భాగంగా మొదటి గెస్ట్ గా బాలకృష్ణ బావగారు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ మొదటి గెస్ట్ లుగా హాజరైనట్టు తెలుస్తోంది.తాజాగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా చంద్రబాబు నాయుడు ఎన్నో విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కాలేజీ రోజులలో చంద్రబాబు నాయుడు చేసిన హంగామా గురించి గుర్తు చేసుకున్నారు.మీరు సినిమాలలో చేస్తే మేము నిజంగానే అమ్మాయిలతో రొమాన్స్ చేశామని కాలేజీ రోజుల్లో మీ కన్నా ఎక్కువగా రొమాన్స్ చేశామంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం గురించి ఆయనతో ఉన్న స్నేహ బంధాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టినట్టు తెలుస్తుంది.
ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ మధ్య కూడా ఒక ఎమోషనల్ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తుంది.1995 లో జరిగిన ఓ సన్నివేశం గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ గా కనిపించారు. అయితే ఈ విషయం ఏంటి? వీరిద్దరి మధ్య ఇంకా ఎలాంటి సంభాషణలు జరిగాయనే విషయం తెలియాలంటే అక్టోబర్ 14వ తేదీ వరకు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…