Racha Ravi: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రచ్చ రవి కూడా ఒకరు. జబర్దస్త్ లో తన పంచులతో సెటైర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రచ్చ రవి.. తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఓకే ఒక్క డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటి ఎక్కడ చూసినా కూడా ఈ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది.
ఇలా జబర్థస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి అటు వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన బలగం సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాడు. సినిమా విడుదల అయిన తరువాత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రచ్చ రవి తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జీవితంలో ఎంత సంపాదించినా కూడా మన అనే వారు తోడుగా లేకపోతే ఆ జీవితం వ్యర్థం. ఇక ఈ ఇంటర్వ్యు లో రచ్చ రవి మాట్లాడుతూ..”ప్రతీ రాఖీ పండక్కి చెల్లి దగ్గరికి పోయి రాఖీ కట్టించుకునేవాడిని. కానీ కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు నాతో మాట్లాడం లేదు. మా ఇంటికి రావడం లేదు. 2016లో జరిగిన నా ఇంటి గృహప్రవేశానికి ఆఖరిసారిగా ఇంటికీ వచ్చింది.
అప్పటి నుండి నా ఇంటి గడప తోక్కలేదు ఈ రోజు నేను ఇంత సంపాదించి ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లిదండ్రులతోపాటు నా చెల్లెలు కూడా కారణం.
సినిమాల మీద ఉన్న ఇష్టంతో సొంత ఊరిని వదిలి పట్నానికి వచ్చేటప్పుడు తను ఇచ్చిన రూ. 123 రూపాయల తీసుకునే నేను హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు నా ఎదుగుదలను కోరుకున్న నా చెల్లెలు ఇప్పుడు నేను జీవితంలో పైకి ఎదిగి ఇంత సంపాదించిన తర్వాత నాకు దూరం అయింది. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ గత కొన్ని సంవత్సరాలుగా నా చెల్లెలు నా ఇంటికి రావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇకనైనా అన్నీ మరిచిపోయి ఇంటికి రా చెల్లి అంటూ తన చెల్లిని వేడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత అచ్చం బలగం సినిమాలో జరిగిన సన్నివేశం లాగే ఉంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…