Actress Radhika: చిరంజీవి తన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అలాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటి రాధికతో కలిసి నటించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పై ఎన్నో రొమాంటిక్ చిత్రాలలో నటించి మంచి విజయాలను వీరి ఖాతాలో వేసుకున్నారు.ఇలా నటీనటులుగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా చిరంజీవి రాధిక మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రతి ఏడాది మెగాస్టార్ ఇంట్లో జరిగే గెట్ టుగెదర్ పార్టీకి రాధిక తప్పనిసరిగా హాజరు అవుతారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి స్నేహితుడు అంటూ రాధిక చెప్పుకొచ్చారు.ఇలా ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధిక ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాలలో హీరోలకు తల్లి పాత్రలలో నటిస్తున్నారు.
ఇలా వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రాధిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు యాంకర్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రాధిక ఎంతో ఆసక్తికరమైన సమాధానం తెలియజేశారు.
చిరంజీవి సినిమాలో ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాను,కానీ ఒక్క పాత్రలో మాత్రం నటించనని తేల్చిచెప్పారు. చిరంజీవి సినిమాలో విలన్ పాత్రలో అయినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తల్లి పాత్రలో మాత్రం నటించనని వెల్లడించారు.ఇలా చిరంజీవి సినిమాల గురించి రాధిక ఆసక్తికరమైన విషయాలు చెప్పడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల పై ప్రశంసలు కురిపించారు. తనకు ఎన్టీఆర్ నటన అంటే ఎంతో ఇష్టమని రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీరందరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, ప్రస్తుతం వీరందరూ ఇలా మంచి పొజిషన్లో ఉండటం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…