ఆగ్నేయ బంగాలఖతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపధ్యంలో దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నేపధ్యంలో ఈరోజు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కృష్ణ, గుంటూరు, అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర పేర్కొంది. రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.



























