Raja Ravindra: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజా రవీంద్ర గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా పలువురు యంగ్ హీరోలకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చిన్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలోనే నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కిన తగ్గేదే అనే సినిమాకి కూడా రాజా రవీంద్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.శ్రీనివాసరాజు దర్శకుడిగా తెరికెక్కిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రాజా రవీందర్ మాట్లాడుతూ చిత్ర బృందంపై ప్రశంసల కురిపించారు. అదేవిధంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ గురించి కూడా ఎంతో గొప్పగా వర్ణిస్తూ… ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి శ్యామల యాంకర్ గా వ్యవహరించారు.
ఈ విధంగా నటుడు రాజా రవీందర్ టెక్నీషియన్లు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరికి శ్యామల ఆంటీకి కూడా ధన్యవాదాలు అంటూ ఆమె పరువు తీశారు. ఇలా రాజా రవీందర్ శ్యామలను ఆంటీ అనడంతో వెంటనే శ్యామల ఏంటి నేను ఆంటీనా.. నేను ఆంటీ అయితే మీరు తాతయ్య అవుతారు అంటూ శ్యామల తనదైన శైలిలో నటుడు రాజా రవీందర్ పై రివర్స్ పంచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…