Rajamouli: సినిమా ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రాజమౌళి హీరోలతో చాలా స్నేహంగా ఉంటారు.ముఖ్యంగా ఈయన ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలతో చాలా స్నేహభావంతో ఉంటారు.
రాజమౌళి ఈ ముగ్గురు హీరోలతో కలిసి ఎక్కువగా సినిమాలు చేశారు.ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించినటువంటి చిత్రం RRR . ఈ సినిమా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది. ఇకపోతే కొన్నిసార్లు మన మధ్య మన స్నేహితుల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే చాలా సంతోషం వేస్తుంది.
ప్రస్తుతం ఇలాంటి ఆనందంలో రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఉన్నారు.గతంలో వీరి ముగ్గురి మధ్య జరిగినటువంటి ఓ సంఘటనకు సంబంధించిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా రాజమౌళి చేసినటువంటి ఈ ట్వీట్ లో ఏముంది అనే విషయానికి వస్తే…
గత 12 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి రామ్ చరణ్ ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ వద్దన్న వినకుండా బలవంతంగా తనతో వోడ్కా తాగించారని ఈ సందర్భంగా రాజమౌళి చేసినటువంటి ఈ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ బర్తడే పార్టీలో బాలయ్య కూడా డాన్స్ అదరగొట్టారు అంటూ రాజమౌళి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఇలా 12 సంవత్సరాల క్రితమే వీరి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది అయితే ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఈ సినిమా సంచలనాలను సృష్టించడం అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్కార్ అవార్డు కార్యక్రమాలలో భాగంగా అమెరికాలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…