RRR Movie: ట్రైన్ బ్లాస్ట్ సన్నివేశం వెనుక రాజమౌళి ఇంత కష్ట పడ్డారా…వైరల్ గా మారిన వీడియో!
RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులను రాజమౌళి ఈ సినిమా ద్వారా కలిపారు. కమర్షియల్ చిత్రాలకు ఎంతో భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా లెక్కలను తిరగరాసేలా జక్కన్న ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
కలెక్షన్ల పరంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాకి ప్రాణం పోశాయని చెప్పవచ్చు. ఈ సన్నివేశాలను VFSX ఎఫెక్ట్స్ తో తెరకెక్కించారని తెలిసినా ప్రతి ఒకరు ఆ సన్నివేశాలను ఎలా తెరకెక్కించారో తెలుసుకోవాలనే ఆతృత కనపరచారు.
ఈ క్రమంలోనే ఈ సన్నివేశాలని తెరకెక్కించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా DVV ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో ట్రైన్ బ్లాస్ట్ సన్నివేశం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సన్నివేశాన్ని తీయడం వెనుక ఎంత కష్టపడ్డారు, ఈ సన్నివేశానికి, వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం.
సినిమాలో ఆయా సన్నివేశాల్లో Alzahravfx సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసిందో తెలుపుతూ యూట్యూబ్ వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు సినిమా పట్ల రాజమౌళి ఉన్న అంకితభావం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ట్రైన్ బ్లాస్ట్ సీన్ కోసం వీఎఫ్‌ఎక్స్ ఎంత కష్టపడ్డారో..మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…