నందమూరి నటసింహం లెజెండ్ బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో చాలా మంచి అభిప్రాయం ఉంది. అతన్ని దగ్గర నుంచి గమనించిన వారు బాలకృష్ణ వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. తన మనసులో ఏం అనిపిస్తే అదే చేస్తారు బాలకృష్ణ. డైరెక్టర్ల హీరో అంటూ బాలకృష్ణకు మంచి పేరుంది. తన సినిమాలో డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తారు బాలయ్య. తనకు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా ఆపుకోలేరు బాలకృష్ణ. తన అభిమానులు క్షమశిక్షణ మరిచి హద్దు మీరి ప్రవర్తిస్తే చంప చెల్లుమనిపించడం మనకు తెలిసిందే.
అయితే ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్య చేయి తగిలిందంటూ.. సంతోషపడతారు. ఇదిలా ఉంటే తాజాగా అఖండ హిట్ ఇచ్చిన కిక్ బాలకృష్ణ లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహాలో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఆ షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముందుగా మోహన్ బాబుతో మొదలైన ఈ ’అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే‘ మొదటి ఎపిసోడ్ తోనే చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చకుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది.
ఇదిలా ఉంటే.. ఐదో ఎపిసోడ్ కు దర్శక ధీరుడు రాజమౌళి గెస్ట్ గా వస్తున్నారు. దీనిపై ప్రోమో కూడా విడుదలైంది. ప్రోమో చూస్తుంటే.. ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ టాక్ షోలో ’ ”ఇప్పటిదాకా మన కాంబినేషన్లో సినిమా పడలేదు.. నా అభిమానులు అడిగారని నాకు తెలుసు.. మీరు నన్ను హ్యాండిల్ చేయలేరు అన్నారట కదా అని రాజమౌళిని బాలకృష్ణ ప్రశ్నిస్తారు. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ..’ ”నిజానికి నాకు భయం సార్.. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. మీకు కోపం వస్తే ఆగరు.. ఎదుటి మనిషి ఎవరు.? ఏంటి అని చూడకుండా నోటికి ఎంతమాట వస్తే అంత మాట తిట్టేస్తాట్టే స్తారు..’ అని సమాధానమిచ్చారు. బాలకృష్ణ బదులిస్తూ ఎవరో డైరెక్టర్ కి జరిగిన సంఘటనను గుర్తుచేస్తూ.. ‘స్క్రి ప్ట్ తీసి నేలపై కొట్టి నేను ఈ సినిమా చేయను’ అని చెప్పేశాను అంటూ ఘాటుగా రియాక్టయ్యారు.
ఆ తర్వా త జక్కన్న మాట్లాడుతూ ”అలా అయితే మీరు చేసింది తప్పని” చెప్పుకొచ్చారు. దీనికి సమాధానంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ”అలా అయితే నేను బాలయ్యను కాదు.. బాలయ్య కాక్టేల్” అన్నారు. దీంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా వచ్చారు. అయితే జక్కన్న చేసిన ఈ కామెంట్లను బట్టి చూస్తే రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా ఉండదనే తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే బాలయ్య అభిమానుల ఆశ నిరాశయ్యే అవకాశమే ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…