Movie News

Rajamouli: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కి నో ఎంట్రీ… రాజమౌళి రియాక్షన్ ఏంటో తెలుసా?

Rajamouli: దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచంలో విడుదలైన అన్ని భాషలలోనూ ఈ సినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు సినిమా దర్శకుడు రాజమౌళి కి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లు వసూలు చేసి ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. విదేశీ దర్శకులు కూడా రాజమౌళి ప్రతిభకు ప్రశంసలు కురిపించారు. ఇక ఇటీవల ఈ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు కూడా లభించింది.

మొట్టమొదటిసారిగా ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కటంతో సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కు మన దేశం తరఫున ఈ సినిమాకి ఎంట్రీ దక్కకపోవడంతో ప్రేక్షకులందరూ నిరాశ చెందారు.
ఇక ఇటీవల ఈ విషయం గురించి రాజమౌళి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ” మన దేశం తరఫున ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకి అధికారికంగా ఎంట్రీ లభించకపోవడంతో చాలా నిరాశ చెందాను.

Rajamouli ఆస్కార్ ఎంట్రీ రానందుకు ఏడుస్తూ కూర్చోలేదు…

నా సినిమాకి ఆస్కార్ ఎంట్రీ ఎందుకు లభించలేదు అంటూ నేను బాధపడుతూ కూర్చోలేదు. ఆ విషయం గురించి పదే పదే ఆలోచించి బాధపడే రకం కాదు. ఏది ఎలా జరిగినా మేము ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (Last Film Show) ఆస్కార్ షార్టిస్ట్ లో స్థానం సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ అధికారికంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యుంటే మరింత ఆనందంగా ఉండేది”. అంటూ చెప్పుకొచ్చాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago