Rajamouli: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో సీరియల్స్ కి దర్శకత్వం వహించి డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన రాజమౌళి ఓటమెరుగని విక్రమార్కుడుగా ఇండస్ట్రీలో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తున్నారు.
ఇక దర్శకదీరుడు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన చిత్రం RRR. మరో రెండు రోజుల్లో మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా బిజీగా గడుపుతున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ క్రమంలో ఒక నేషనల్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు దర్శకుడు రాజమౌళి. తానూ తీసిన సినిమాలలో తనకు నచ్చని సినిమా ఉందని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. మీరు తీసిన సినిమాలలో మీకు నచ్చని సినిమా ఏంటి అని అడిగింది. దీనికి సమాధానంగా రాజమౌళి తానూ తొలిసారి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం అంటే తనకు నచ్చదని.. ఆ సినిమా అంటే తనకు చాలా చిరాకని.. మొదటి సినిమా కావడంతో అవగాహన లేక సినిమా అలా తీయాల్సివచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా 2001లో విడుదలై టాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది..
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…