సినిమా ఇండస్ట్రీలో కొందరి మధ్య స్నేహం ఏర్పడి వారితో పాటుగానే స్నేహం కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో స్నేహంగా ఉన్నవారిలో రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పవచ్చు. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలలో చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితులు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరు కలిసి వెండితెరపై కనిపించకపోవడంతో వీరి స్నేహం పై పలు సందేహాలను వ్యక్తం చేశారు.
తారక్ కనకాల మధ్య ఏం జరిగింది..? ఎందుకు దూరంగా ఉంటున్నారని అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల తాజాగా నటించిన “నారప్ప” సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ తారక్ తో తనకు ఏర్పడిన విభేదాలపై స్పందించారు. ఈ సందర్భంగా రాజీవ్ మాట్లాడుతూ…
తారక్ తో నాకు విభేదాలు ఏర్పడ్డాయి అన్న విషయం నేను కూడా విన్నాను అయితే మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా రాజీవ్ స్పష్టం చేశాడు. నేను హీరోగా కొన్ని సినిమాలకు కమిట్ అవ్వడం వల్లే ఎన్టీఆర్ సినిమాలలో చేయలేకపోతున్నానని తెలిపారు. తారక్ తన సినిమాలలో నన్ను తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నేను సినిమాల్లో నటించడం తనకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. భావిస్తాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించే సినిమాలలో నన్ను పెట్టుకోవాలని చూస్తాడు. నా కోసం స్క్రిప్టులో మార్పులు చేయాల్సి వస్తోంది నాకోసం దర్శకనిర్మాతలకు ఇబ్బంది పెట్టొద్దంటూ ఎన్టీఆర్ తో చెప్పడం వల్లే తన సినిమాలలో నేను కనిపించడం లేదని ఈ సందర్భంగా రాజీవ్ కనకాల చెప్పారు. ఇంతకు తప్పితే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ సందర్భంగా అభిమానులకు వివరణ ఇచ్చారు.
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…
టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…