Rajendra Prasad: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి కిరీటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో రాజేంద్రప్రసాద్ ఒకరు. కమెడియన్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలలో అలాగే స్పెషల్ రోల్స్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ఏకైక కుమార్తె గుండెపోటుతో మరణించడంతో ఈయన ఎంతగానో కృంగిపోయారు. ఇలా రాజేంద్రప్రసాద్ కూతురు మరణం తర్వాత మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
రాజేంద్రప్రసాద్ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట. ఇక ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అవకాశాలు లేక చేతిలో చిల్లి గవ్వలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించానని రాజేంద్రప్రసాద తెలిపారు.
తాను సినిమాలలోకి వస్తానంటే నాన్న ఒప్పుకోలేదు ఇంటర్ ఫెయిల్ అయ్యాను.. నాన్న ఇంట్లోకి కూడా రావద్దన్నారు ఆ సమయంలో ఒక్క వేషం కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను అప్పుడే సూసైడ్ చేసుకోవాలని ఆలోచించాను. చివరి ప్రయత్నంగా పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళ్తే ఆయన డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చారు ఆ అవకాశం తో నా దశ తిరిగిపోయింది అంటూ ఈ సందర్భంగా తన కెరియర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…