Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటి శ్రీ లీల త్వరలోనే రాబిన్ హుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు శ్రీ లీల చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా శ్రీ లీల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ భారీగా ట్రెండ్ అవ్వడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేస్తున్నాయి. అయితే ఈ పాట గురించి రిపోర్టర్ శ్రీ లీలను ప్రశ్నిస్తూ.. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఇలా స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణమేంటని ప్రశ్నించారు.
నేను ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి చాలా పెద్ద రీసన్ ఉంది అయితే ఆ రీజన్ ఏంటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది అని తెలిపారు.. మీరు డ్యాన్సింగ్ క్వీన్ కదా మరి మీ దృష్టిలో డ్యాన్సింగ్ కింగ్ ఎవరు అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. అల్లు అర్జున్ డ్యాన్సింగ్ కింగ్ కావడంతోనే మా కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పెషల్ సాంగ్ ఎంతో అద్భుతంగా ఉందని శ్రీ లీల తెలిపారు. ఇక ఈ పాటకు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి కూడా ప్రశ్న ఎదురవడంతో ఇప్పటివరకు నేను నిర్మాతలతో రెమ్యూనరేషన్ గురించి అసలు మాట్లాడలేదు నేను కేవలం బాధ్యతతో మాత్రమే ఈ సాంగ్ చేశానని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…