Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అవసరం లేని పేరు ఒక సాధారణ బస్ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రజనీకాంత్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక సినిమాల పరంగా రజనీకాంత్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే పెళ్లి కాకముందు రజనీకాంత్ చాలా కోపంగా ఉండే వారట.తన కళ్ళముందు అన్యాయం జరిగితే ఏ మాత్రం ఓర్చుకోరని తీవ్రస్థాయిలో మండిపడేవారని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఈయన పూర్తిగా మారిపోయారనేది సన్నిహితుల సమాచారం.
రజనీకాంత్ తన భార్యలత ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే లతా మరెవరో కాదు రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు అయినటువంటి సహ నటుడు వై.జి. మహేంద్రన్ సోదరినే లత. రజనీకాంత్ తన స్నేహితుడు మహేంద్ర ఇంటికి తరచూ వెళ్లేవారట అలా లతతో తనకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇలా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత రజనీకాంత్ లతా కారణంగా చాలా మారిపోయారు. తనలో ఉన్న కోపాన్ని తగ్గించడమే కాకుండా తనకు ఉన్నటువంటి సిగరెట్ మందు అలవాటును కూడా లతా మాన్పించారని తెలుస్తోంది అయితే ఇదే విషయం గురించి రజనీకాంత్ సైతం తన భార్య వల్లే తన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఏది ఏమైనా రజనీకాంత్ ప్రేమ పెళ్లి తనపై చాలా ప్రభావం చూపించి తనని మంచి మనిషిగా మార్చాయని చెప్పాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…