Rajinikanth: తమిళ తలైవా రజినీకాంత్ స్టార్ డం గురించి చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లి ఎంతోమంది యోగులను మునులను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే రజినీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. రజనీకాంత్ తనని కలవడానికి వస్తున్నారు అనే విషయం తెలియగానే యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకడానికి బయటకు వచ్చారు అయితే రజనీకాంత్ కారు దిగిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి రజనీకాంత్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎంతో స్టార్డం ఉన్నటువంటి రజినీకాంత్ ఇలా తనకన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నవాడు అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం ఏంటి అంటూ రజనీకాంత్ వ్యవహార శైలి పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఈ విషయం గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇకపోతే తాజాగా రజనీకాంత్ తన ట్రిప్ ముగించుకొని తిరిగి చెన్నై వచ్చారు. ఈ క్రమంలోనేఎయిర్ పోర్టులో మీడియా ఈ విషయం గురించి రజనీకాంత్ ను ప్రశ్నించడంతో ఆయన ఒకే ఒక్క మాటలో ఈ ప్రశ్నలకు ఈ విమర్శలకు సమాధానం ఇచ్చారు.ఈ విషయం గురించి రజనీకాంత్ మాట్లాడుతూ వయసులో తన కన్న చిన్నవారైనా సరే వారు యోగి లేదా స్వామీజీ అయితే తప్పకుండా వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటానని ఇది నా పద్ధతి అంటూ రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…