Categories: FeaturedMovie News

రాకేష్ మాస్టర్, శ్రీ రెడ్డిల కోల్డ్ వార్ ఒట్టి పబ్లిసిటీ స్టంటేనా.?

మీటూ ఉద్యమం ద్వారా పాపులరైన శ్రీ రెడ్డి, డాన్స్ మాస్టర్ రాకేష్ ల మధ్య కొంతకాలం నుండి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే.! వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూల్లో ఒకరి సీక్రెట్ విషయాలను మరొకరు బహిరంగపరచడంతో వీళ్ళిద్దరి రచ్చ మొదలైంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడం, నువ్వెంతంటే నువ్వెంతనుకుంటూ ఛాలెంజ్ లు విసురుకోవడం, ప్రేక్షకులకే రోత పుట్టించేలా ఒకరినొకరు పచ్చి బూతులు తిట్టుకోవడం ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.

తాజాగా తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ వలన నాగబాబు ఫైరైన సంగతి, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద జరుగుతున్న వివాదం మీకు తెలుసు. ఈ రెండు అంశాలపైనా రాకేష్ మాస్టర్ స్పందించాడు. రాకేష్ మాస్టర్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి రాకేష్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో దూషించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇంతవరకూ రాకేష్ మాస్టర్ తో గొడవ పెట్టుకోని ఆర్టిస్ట్ ఎవ్వరూ మిగల్లేదు. మాధవీలత, శ్రీరెడ్డి ఇలా ప్రతీ ఒక్కరిపైనా కామెంట్స్ చేశాడు. మాధవీలత అయితే ఏకంగా లీగల్ నోటీసులు కూడా పంపింది. శ్రీ రెడ్డి మాత్రం తన ఫేస్ బుక్ ఖాతాలో రాకేష్ మాస్టర్‌నుద్దేశించి తీవ్రమైన అసభ్య పదజాలంతో పోస్ట్‌లు పెడుతుంది.

ఇక తాజా వివాదంలోకొస్తే.. కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్ ల విషయమై ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చించడం, దానికి బాలయ్యను పిలవకపోవడంతో బాలయ్య భూములు పంచుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ రెంటిపై రాకేష్ మాస్టర్ స్పందిస్తూ బాలయ్యను సమర్థించాడు. ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశాడు.

ఇక రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఫైర్ అయింది. రాయడానికి, వినడానికి కూడా వీలు కాని పదాలతో పచ్చి బూతులతో రాకేష్ మాష్టర్‌ను ఇష్టమొచ్చినట్టు దూషించింది. ఎన్టీఆర్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను తిట్టడం ఆపకపోతే.. ఎక్కడున్నాడో తెలుసుకుని మరి వెతికి వెతికి కొడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరి గొడవకు విసిగిపోయిన ప్రేక్షకులు మాత్రం కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఇంతిలా దిగజారిపోతూ రోడ్డెక్కుతున్న ఇలాంటి ఆర్టిస్టులంటే చిరాకు పుడుతుందంటున్నారు. మరి మీరేమంటారు.?! వీళ్ళిద్దరి ఫైటింగ్ ఫేకా..? రియలా.?????????????

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago