మీటూ ఉద్యమం ద్వారా పాపులరైన శ్రీ రెడ్డి, డాన్స్ మాస్టర్ రాకేష్ ల మధ్య కొంతకాలం నుండి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే.! వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూల్లో ఒకరి సీక్రెట్ విషయాలను మరొకరు బహిరంగపరచడంతో వీళ్ళిద్దరి రచ్చ మొదలైంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకోవడం, నువ్వెంతంటే నువ్వెంతనుకుంటూ ఛాలెంజ్ లు విసురుకోవడం, ప్రేక్షకులకే రోత పుట్టించేలా ఒకరినొకరు పచ్చి బూతులు తిట్టుకోవడం ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.

తాజాగా తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ వలన నాగబాబు ఫైరైన సంగతి, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద జరుగుతున్న వివాదం మీకు తెలుసు. ఈ రెండు అంశాలపైనా రాకేష్ మాస్టర్ స్పందించాడు. రాకేష్ మాస్టర్ కామెంట్స్ ని ఉద్దేశిస్తూ శ్రీ రెడ్డి రాకేష్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో దూషించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇంతవరకూ రాకేష్ మాస్టర్ తో గొడవ పెట్టుకోని ఆర్టిస్ట్ ఎవ్వరూ మిగల్లేదు. మాధవీలత, శ్రీరెడ్డి ఇలా ప్రతీ ఒక్కరిపైనా కామెంట్స్ చేశాడు. మాధవీలత అయితే ఏకంగా లీగల్ నోటీసులు కూడా పంపింది. శ్రీ రెడ్డి మాత్రం తన ఫేస్ బుక్ ఖాతాలో రాకేష్ మాస్టర్‌నుద్దేశించి తీవ్రమైన అసభ్య పదజాలంతో పోస్ట్‌లు పెడుతుంది.

ఇక తాజా వివాదంలోకొస్తే.. కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్ ల విషయమై ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో చర్చించడం, దానికి బాలయ్యను పిలవకపోవడంతో బాలయ్య భూములు పంచుకోవడానికే మీటింగ్ పెట్టుకున్నారని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ రెంటిపై రాకేష్ మాస్టర్ స్పందిస్తూ బాలయ్యను సమర్థించాడు. ఎన్టీఆర్, ఆయన ఫ్యాన్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశాడు.

ఇక రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై శ్రీ రెడ్డి ఫైర్ అయింది. రాయడానికి, వినడానికి కూడా వీలు కాని పదాలతో పచ్చి బూతులతో రాకేష్ మాష్టర్‌ను ఇష్టమొచ్చినట్టు దూషించింది. ఎన్టీఆర్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను తిట్టడం ఆపకపోతే.. ఎక్కడున్నాడో తెలుసుకుని మరి వెతికి వెతికి కొడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరి గొడవకు విసిగిపోయిన ప్రేక్షకులు మాత్రం కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ఇంతిలా దిగజారిపోతూ రోడ్డెక్కుతున్న ఇలాంటి ఆర్టిస్టులంటే చిరాకు పుడుతుందంటున్నారు. మరి మీరేమంటారు.?! వీళ్ళిద్దరి ఫైటింగ్ ఫేకా..? రియలా.?????????????



























