Movie News

Ram Charan : సినిమా అంతర్గత సమస్యలను గురించి హీరోలతో చర్చించడానికి ముందుకొచ్చిన రామ్ చరణ్…!

Ram Charan : సినిమా అంటే కేవలం ఒక హీరోనో దర్శకుడో కాదు, అన్నింటికీ మించి నిర్మాత ఉంటేనే ఒక సినిమా వస్తుంది. అందుకే సినిమా తీసే నిర్మాత బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. కానీ కరోనా వల్ల సినిమా పరిశ్రమ బాగా దెబ్బతినింది. ముఖ్యంగా పని లేకపోవడం వల్ల కార్మికులు ఎంత నష్టపోయారో, డబ్బు పెట్టిన సినిమా బిజినెస్ కాకపోవడం వల్ల నిర్మాత అంతే నష్టపోయాడు. ఇక కరోనా తరువాత అన్నా బిజినెస్ బాగా జరిగి సినిమాలు హిట్ అయి నిర్మాత లాభపడ్డాడా అంటే అది లేదు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒక వైపు, థియేటర్లలో టికెట్ రేట్లు మరో వైపు నిర్మాతను ఇబ్బంది పెడుతున్నాయి.

హీరోలతో చర్చించడానికి రామ్ చరణ్ చొరవ…

సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, అంతర్గత సమస్యలు, టికెట్ రేట్లు మొదలైన వాటి గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నా, ఇప్పుడు మాత్రం నిర్మాతల గిల్డ్ ఈ విషయాలపై చర్చించి సినిమా నిర్మాణం వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈవిషయాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దృష్టికి నిర్మాతల గిల్డ్ తరుపున దిల్ రాజు తీసుకెళ్లారు.

దీనికి సానుకూలంగా స్పందించిన రామ్ చరణ్ హీరోలందరితో మాట్లాడి చర్చిస్తాను అని మాటిచ్చాడు. రెమ్యూనరేషన్ తగ్గించుకునే విషయంలో లో హీరోలతో చర్చిస్తానని హామీ ఇచ్చాడు. హీరోల తరుపున వారి సమస్యలను కూడా తెలుసుకుని నిర్మాత్సల గిల్డ్ కి తెలియజేయాలనీ రామ్ చరణ్ కి దిల్ రాజు చెప్పారు. నిర్మాతల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సినిమా షూటింగులు బంద్ చేయాలనే నిర్ణయం వల్ల ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక ఈవిషయాలలో భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago