Featured

Ram Charan: RC16 బుచ్చి బాబు సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. చరణ్ సరసన నటించేది ఆ హీరోయినే?

Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.

కాగా దిల్ రాజు ఇప్పటివరకు నిర్మించిన సినిమాలలో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ సినిమా. దాదాపుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కోస్తా బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది.

ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు ఆ మధ్య డైరెక్టర్ బుచ్చిబాబే బిగ్ బాస్ తెలుగు షోలో వెల్లడించాడు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ సరసన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ అలియాభట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఆర్ఆర్ఆర్ లో కలిసి నటించిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను బుచ్చిబాబు సనా అడిగినట్లు ,డిస్కషన్స్ జరుగుతున్నట్లు టాక్. నిర్మాతలు ముంబై వెళ్లి ఆమెతో నెగోషియోషన్స్ చేస్తున్నారని, మాగ్జిమం ఓకే కావచ్చు అని అంటున్నారు.

చరణ్ సరసన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..

ఆర్ఆర్ఆర్ తో ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఏర్పడిందని, దాంతో స్క్రీన్ పై ఏ ఇబ్బంది లేకుండా ఈ జంట కెమిస్ట్రీ పండుతుందని భావించి దర్శక,నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. అలాగే అదే సమయంలో అలియా కనుక నో చెప్తే సాయి పల్లవి ని సీన్ లోకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా కన్నడ స్టార్ శివ రాజ్‌‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారట. ఇంకా ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రాంచరణ్ పుట్టిన రోజు నాడు అనగా మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

17 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

17 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago