టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి కాగానే చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇప్పటికే శంకర్ ఈ సినిమాను ఎక్కడ చిత్రీకరించాలనే విషయాల గురించి ఆలోచించాడని అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెల నుంచి వీరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం వినబడుతుంది. ఎక్కువభాగం ఈ చిత్రాన్ని శంకర్ ఇండియాలోనే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని..ఇండియాలో కూడా ఎక్కువ భాగం తెలంగాణలో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 8న సినిమా షూటింగ్ ప్రారంభం కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది జూలై నాటికి ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబోలో తెలుగులో “వినయ విధేయ రామ” తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే చెర్రీ సరసన నటించారు. ఇక ఆచార్య సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…