Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక సెట్ లో ఈ పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా రాంచరణ్ సతీమణి ఉపాసన కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నటువంటి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఇక ఈ పూజ కార్యక్రమాలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయి క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నటువంటి తరుణంలో ఆయన కూడా ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఇక డైరెక్టర్ సుకుమార్ తో పాటు శంకర్ కూడా ఈ పూజ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్పెషల్ అట్రాక్షన్ గా ఉపాసన..
ఇక రాంచరణ్ కెరియర్ లో ఇది తన 16వ సినిమా కావటం విశేషం ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ నటిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అప్పట్లో శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి అయితే తిరిగి వీరిద్దరి వారసులతో సినిమా రాబోతున్న తరుణంలో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…