Ramcharan: రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఉత్తరాదిన కూడా ఊహించని రీతిలో స్పందన రావడం, అక్కడ కూడా వసూళ్ల పరంగా ముందంజలో కలెక్షన్లు దూసుకుపోవడంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ విడుదలవుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి పని చేయడం వారు గర్వంగా ఫీలవుతున్నారు. అయితే తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన మంచితనాన్ని చాటుకున్నారు.. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన 35 మందిని అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు.
ఇంటికి వచ్చిన వారితో కాసేపు సరదాగా సమయం గడిపిన రామ్‌చరణ్, అనంతరం వారందరికీ ఒక్కొకరికి 10 గ్రాములు విలువ చేసే బంగారు కాయిన్ కానుకగా ఇచ్చారు. అంతేకాకుండా వారికి కేజీ స్వీట్ బాక్స్ చొప్పున అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్‌చరణ్ వాళ్లను కొనియాడారు.
రామ్ చరణ్ చేసిన పనికి వారితో పాటు అభిమానులు, ప్రేక్షకులు చరణ్ ని అభినందిస్తున్నారు. ఇక స్టార్ హీరో నుంచి పిలుపు రావడమే గొప్పగా భావించిన వారు, అతని మర్యాదలు, ఇచ్చిన బహుమతులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పని చేయడంతో ఆయన ఫ్యాన్సే కాదు, సినీ ప్రేక్షకులు కూడా ఆయనది బంగారు మనసు అంటూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…