Featured

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

Actress Anthea Maali: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెత ప్రస్తుత కాలంలో ఉన్న హీరోయిన్లకు కరెక్టుగా సరిపోతుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏమాత్రం క్లిక్ అయిన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బును పోగు చేసుకుంటున్నారు. తరువాత సినిమా అవకాశాలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

అయితే ఇలా భవిష్యత్తు పై అవగాహన లేకుండా ఎంతో మంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి చివరికి ఉన్న డబ్బులు అన్నింటిని ఖర్చు చేసుకొని దీన స్థితిలో మరణించిన ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన వారే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. జనవరి 18, 1954 లో జన్మించిన ఈయన భారత దేశ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

ఈ విధంగా ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందిన జగదీష్ మాలి భారీ మొత్తంలోనే ఆస్తులను పోగు చేశారు. ఇలా ఆస్తిపాస్తులను కూడబెట్టిన ఈయన తన కూతురు అంత్ర మాలిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈమె తెలుగు హిందీ సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్దఎత్తున ప్రమోషన్ చేయటం కోసం జగదీష్ మాలి తన ఆస్తులన్ని ఖర్చు చేశారు.ఇలా కూతురి కోసం సంపాదించిన ఆస్తుల మొత్తం ఖర్చు చేసి చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్లో దీన స్థితిలో ఉన్నారు. ఇలా దీనస్థితిలో బతుకుతున్న ఈయనకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం చేశారు.

సర్వస్వం పోగొట్టుకున్న తండ్రి..

ఇలా ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. కూతురి కోసం తన సర్వస్వం పోగొట్టుకున్న జగదీష్ చివరి రోజులలో తన కూతురు అంత్ర మాలి ప‌ట్టించుకోలేద‌న్న ప్రచారం జరిగింది. ఇలా కూతురి కోసం సర్వస్వం పోగొట్టుకున్న ఆ తండ్రి చివరికి దీన స్థితిలో మరణించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago