Actress Anthea Maali: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెత ప్రస్తుత కాలంలో ఉన్న హీరోయిన్లకు కరెక్టుగా సరిపోతుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏమాత్రం క్లిక్ అయిన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బును పోగు చేసుకుంటున్నారు. తరువాత సినిమా అవకాశాలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఇలా భవిష్యత్తు పై అవగాహన లేకుండా ఎంతో మంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి చివరికి ఉన్న డబ్బులు అన్నింటిని ఖర్చు చేసుకొని దీన స్థితిలో మరణించిన ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన వారే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. జనవరి 18, 1954 లో జన్మించిన ఈయన భారత దేశ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందిన జగదీష్ మాలి భారీ మొత్తంలోనే ఆస్తులను పోగు చేశారు. ఇలా ఆస్తిపాస్తులను కూడబెట్టిన ఈయన తన కూతురు అంత్ర మాలిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈమె తెలుగు హిందీ సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇలా తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్దఎత్తున ప్రమోషన్ చేయటం కోసం జగదీష్ మాలి తన ఆస్తులన్ని ఖర్చు చేశారు.ఇలా కూతురి కోసం సంపాదించిన ఆస్తుల మొత్తం ఖర్చు చేసి చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్లో దీన స్థితిలో ఉన్నారు. ఇలా దీనస్థితిలో బతుకుతున్న ఈయనకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం చేశారు.
సర్వస్వం పోగొట్టుకున్న తండ్రి..
ఇలా ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. కూతురి కోసం తన సర్వస్వం పోగొట్టుకున్న జగదీష్ చివరి రోజులలో తన కూతురు అంత్ర మాలి పట్టించుకోలేదన్న ప్రచారం జరిగింది. ఇలా కూతురి కోసం సర్వస్వం పోగొట్టుకున్న ఆ తండ్రి చివరికి దీన స్థితిలో మరణించారు.





























