టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రౌద్రం, రణం, రుధిరం.. టాలీవుడ్ బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రతీ ఒక్క అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
.ఇప్పటికే గతంలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ అన్న ప్రచారం జరిగింది. తరువాత ఇంటర్వెల్ బ్లాక్‌లో రామ్ చరణ్ యాక్షన్ ఎపిసోడ్ గూజ్‌బంప్స్ తెప్పిస్తుందన్న టాక్ వినిపించింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరిదశలో ఉండటంతో సినిమా గురించి ఏ చిన్న వార్త తెలిసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో ఓ భావోద్వేగమైన సన్నివేశం గురించి న్యూస్ బయటికి వచ్చింది.
ఏంటంటే..ఈ సినిమాలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఓ జైలులో కలుసుకుంటారట. ఆ ఎపిసోడ్‌ను ఎమోషనల్‌గా తెరకెక్కించారట రాజమౌళి. అంతేకాదు ఈ సీన్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే సాంగ్ ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తుందన్నది తాజా అప్‌డేట్.అసలు ఈ వార్తల్లో నిజమెంత..? నిజంగానే సినిమాలో ఆ సీన్స్ ఉంటాయా..? అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి.?ఈ విషయంలో అందరూ ట్రిపులార్ మేకర్స్ వైపే చూస్తున్నారు.
సినిమా మీద బజ్ కంటిన్యూ చేసేందుకు యూనిటే ఇలాంటి లీకులు ఇస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మేకింగ్ విషయంలోనే కాదు ప్రమోషన్ విషయంలోనే డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేసే జక్కన్న…. ట్రిపులార్ కోసం ఇలా ప్రమోషన్ చేస్తున్నారంటున్నారు ఓ వర్గం ఆడియన్స్.. ఈ వర్షన్‌లో నిజమెంతో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో అలియా భట్ ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కనిపించనున్నాడు..!!
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…