Tillu Square: సిద్దు జొన్నల గడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రానికి సిద్ధూనే కథని, మాటల్ని అందించారు. ఈ సినిమా మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించగా రెండో భాగంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి రోజు నుంచి ఇప్పటివరకు భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
ఈ విధంగా టిల్లు స్క్వేర్ సినిమాకు మంచి ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ సినిమా చూసి సినిమా పట్ల ప్రశంసల కురిపిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని నటుడు రామ్ చరణ్ కూడా చూశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా చూసిన చరణ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
సక్సెస్ అయిన టిల్లు..
డియర్ సిద్ధూ నీ అద్భుతమైన సక్సెస్ చూసి చాలా గర్వంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్, మాలిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్స్, చిత్ర నిర్మాతలకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ రాంచరణ్ పోస్ట్ చేయడంతో ఇదే పోస్ట్ అనుపమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ థాంక్యూ సో మచ్ రామ్ చరణ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా సక్సెస్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్న సంగతి కూడా తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…