ram gopal varma fires on trollers and comparing them with dogs

Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి… ఊర కుక్కలంటూ కామెంట్ !

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో ఎప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వర్మ ఏం చేసిన సంచలనమే… ఆయన సినిమాలు చేసే రచ్చ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా కన్నా ఇంటర్వ్యూలు, ట్విట్టర్ లో ట్వీట్ ల ద్వారా కూడా ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు ఆర్జీవి.

Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి... ఊర కుక్కలంటూ కామెంట్ !
Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి… ఊర కుక్కలంటూ కామెంట్ !

త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్రోల‌ర్స్‌ ఊరకుక్క‌లతో సమానం అని అన్నారు. అలానే వ‌ర్మ మాట్లాడుతూ… ట్రోలర్స్ అంటే మ‌న‌తో ఉండేవారే. కానీ బ‌య‌ట‌కు మాత్రం వారెవ‌రో తెలియ‌దు. ఎక్క‌డుంటారో తెలియ‌దు. దేశ ప్ర‌ధాని కావ‌చ్చు, ముఖ్య‌మంత్రి కావ‌చ్చు, అమితాబ్ బ‌చ్చ‌న్‌ లాంటి సూప‌ర్ స్టార్ కావ‌చ్చు, ఎవ‌రినైనా ప‌ట్టించుకోరు. ట్రోల్, రివ్యూ, విమ‌ర్శ చేయ‌డానికి చాలా తేడా ఉంటుంది.

Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి… ఊర కుక్కలంటూ కామెంట్ !

ట్రోల్ అంటే ఫ‌న్ అనే అనుకోవాలి. అయితే ఈ ఫ‌న్ వ‌ల్ల మ‌నుషులు గాయ‌ప‌డ‌తారంతే. ట్రోల్స్ కార‌ణంగా అలిగి సోష‌ల్ మీడియా నుంచి వెళ్లిపోయిన వారున్నారు. సూసైడ్ చేసుకున్న‌వాళ్లున్నారు అని వర్మ వ్యాఖ్యానించారు. అప్పుడెప్పుడో మీరా చోప్రా జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే నాకు తెలియ‌ద‌ని అందో… మ‌రేదైనా అందో తెలియ‌దు. కానీ ట్రోల‌ర్స్ ఆమెపై రెచ్చిపోయారు. ఆమెను అన‌రాని మాట‌లు అన్నారు. ఆమె ట్రోలింగ్‌పై కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది అని గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి రీజన్ అదే ?

మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి పెద్ద హీరోపై ట్రోలింగ్ రావ‌డానికి కార‌ణ‌మేంటి ? అని ప్రశ్నించారు. అందుకు ఆర్జీవీ స్పందిస్తూ ‘‘ఒకటి అపోజిట్ హీరో ఫ్యాన్స్ కావచ్చు. లేదా ఆయన రాజకీయాలతో ముడి పడి ఉన్నారనే కారణం కావచ్చు. మన వ్యతిరేకంగా ఓ ఆలోచన ఉందంటే కచ్చితంగా ట్రోల్స్ వస్తాయి అన్నారు ఆర్జీవీ. మరి వర్మ మాటలపై ట్రోల‌ర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.