Ram The Warrior movie: ‘ది వారియర్’గా వచ్చేస్తున్న రామ్..! పస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా..!
Ram The Warrior movie: యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం #RAPO19. దీని టైటిల్ ‘యోధుడు(The Warrior)’. తమిళ చిత్ర నిర్మాత లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌లో.. రామ్ పోతినేని పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు.
ఎక్కువగా మాస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫోటోలల్లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. వీటిని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దర్శకుడు గతంలో చేసిన రెండు తెలుగు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో పూర్తిగా విఫలమయ్యాయి.
పందెం కోడి 2 డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రజల నుండి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇలా లింగుస్వామికి గత కొంతకాలంగా ఎలాంటి హిట్ అందుకోలేదు. దీనితో అయినా ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నాడు.
లింగుస్వామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో సినిమా కావడం, తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నాడు. అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్యాస్ట్ ఉండడం కూడా సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైంది.
ఇదిలా ఉండగా.. పోస్టర్ విడుదలన కొద్ది సమయానికే ఆ టైటిల్ పై వివాదాలు నెలకొన్నాయి. తన టైటిల్ ను కాపీ కొట్టారని హవీష్ అనే యంగ్ హీరో ఆరోపిస్తున్నాడు. వారియర్ అనే టైటిల్ ను తన సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు త్వరలోనే సినిమా డీటెయిల్స్ ను కూడా ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. రాపో19 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రారంభించినప్పుడు కథ కాపీ వివాదంలో చిక్కుకుంది. ఇలా వివాదాల నడుమ ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…