Ramcharan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన RRRసినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకుంది.
ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం విశేషం. ఈ అవార్డు అందుకున్న అనంతరం ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అంతర్జాతీయ మీడియా సమావేశంలో పాల్గొని పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ RRR సినిమా గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.
ఈ సినిమాలోని నాటు నాటు పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను గాయపడ్డానని తెలిపారు.ఇలా గాయాలు కావడంతో సుమారు మూడు నెలల పాటు షూటింగ్ కి దూరంగా ఉన్నానని రామ్ చరణ్ తెలిపారు. మూడు నెలల తర్వాత సరాసరి నాటు నాటు పాట షూటింగ్లో పాల్గొన్నానని తెలిపారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా హాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ తనకు హాలీవుడ్ హీరోలైనటువంటి బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ ఎంతో స్ఫూర్తి అని తెలిపారు.ఇక ఈ హీరోలు నటించిన సినిమాలను తాను ఎప్పటికీ మిస్ కానని ఇద్దరు వయసు పెరుగుతున్న కొద్ది అభిమానులను కూడా పెంచుకుంటూ పోతున్నారని ఈ సందర్భంగా రామ్ చరణ్ హాలీవుడ్ హీరోల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…