Movie News

Kajol about Ramoji Film City : ‘రామోజీ ఫిల్మ్ సిటీ చాలా భయంకరంగా ఉంటుంది..’’ నటి కాజోల్ సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం… మళ్లీ అక్కడికి వెళ్లకూడదని అనిపిస్తోంది’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

‘Ramoji Film City is very scary..” Actress Kajol’s sensational comments!

తాజాగా ఆమె నటించిన హారర్ చిత్రం ‘మా’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్, గతంలో జరిగిన షూటింగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు:

‘‘కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ సమయంలో చాలా నెగటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం.. అక్కడ ఎంతసేపైనా ఉండాలని అనిపించదు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది. మళ్లీ అటువంటి ప్రదేశాలకు వెళ్లకూడదని అనుకున్నాను’

ఈ మాటలతో పాటు కాజోల్ ఉదాహరణగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీను ప్రస్తావిస్తూ, ‘‘అది నాకు ఇప్పటివరకు చూసిన ప్రదేశాల్లోనే అత్యంత భయంకరమైనదిగా అనిపించింది’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆ ప్రదేశంలో ఆమెకు ఏవిధమైన అనుభవం ఎదురైంది అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామోజీ ఫిల్మ్ సిటీ అనేక హిట్ చిత్రాలకు వేదికగా నిలిచిన ప్రఖ్యాత ప్రదేశం. అలాంటి ప్రదేశంపై ఒక ప్రముఖ నటి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి వివిధ రకాల స్పందనలు వస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు కాజోల్ నుంచి స్పష్టత వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, కాజోల్ నటించిన హారర్ చిత్రం ‘మా’ ఈ నెల జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

telugudesk

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

9 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

12 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

12 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

12 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

14 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

14 hours ago