YS Jagan Mohan Reddy: రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం తెల్లవారుజామున 4:30 నిమిషాలకు కన్ను మూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈయన మంచానికే పరిమితమయ్యారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.
ఈ విధంగా రామోజీరావు ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అయితే అక్కడ వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఉన్న ఈయన నేడు ఉదయం మరణించారు.
ఇక రామోజీరావు మరణించారు. అనే వార్త తెలియడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు మీడియా రంగం వారు రామోజీరావు మృతి పై స్పందిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈయన పార్టీవ దేహం రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నటువంటి తన నివాసం వద్ద ఉంచారు.
పత్రికా రంగానికి యనలేని సేవలు..
ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల సినిమా సెలబ్రిటీలు అక్కడికి చేరుకొని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా రామోజీరావు మృతి పై స్పందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. పత్రికా రంగానికి దశాబ్దాలుగా వినలేని సేవ చేశారని జగన్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ జగన్ ట్విట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…