Movie News

Ramoji Rao: రామోజీరావు మొదట చేసిన ఉద్యోగం ఏంటో తెలుసా.. అదే ఈ స్థాయికి తీసుకువచ్చిందా?

Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం తెలిసినదే. ఇక ఈయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక రామోజీరావు మరణించడంతో ఆయనకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. ఈయనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇక ఈయనకు తన తాతయ్య రామయ్య పేరును పెట్టారు.

ఇక ఈయనకు ఈ పేరు నచ్చకపోవడంతో ప్రాథమిక పాఠశాలలో చేరే సమయంలో తన పేరును తానే స్వయంగా రామోజీరావుగా మార్చుకున్నారు.చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా మొదట ఉద్యోగంలో చేసారు. అయితే 1962 లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టి సారించారు.ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు.

రామోజీ ఫిలిం సిటీ…

రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. ఇక హైదరాబాద్లో హాలీవుడ్ తరహా ఫిలిం సిటీని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈయన రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఇలా ఈయన పత్రిక రంగంలోనూ చిత్ర పరిశ్రమలోను ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago