Movie News

Ramoji Rao: రామోజీరావు మృతి పై ఎమోషనల్ అయిన ఎన్టీఆర్.. ఆ జ్ఞాపకాలు మరువలేనివంటూ?

Ramoji Rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో నేడు మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈయన నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్న రామోజీరావు నేడు ఉదయం 4:30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణించారనే వార్త తెలియడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ అలాగే మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మీడియా రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు చలనచిత్ర పరిశ్రమకు కూడా ఎన్నో అద్భుతమైన సేవలు అందించారు.

ఇక నిర్మాతగా కూడా ఈయన ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక రామోజీరావు మరణం పై అటు రాజకీయ నాయకులు ఇటు సినీ నిర్మాతలు స్పందించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రామోజీరావు మృతి పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
లోటు పూడ్చలేనిది…

శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

https://x.com/tarak9999/status/1799264559758492159?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799264559758492159%7Ctwgr%5E91cf546f1f8c6fb9a20b6432bb3cedecdf313335%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmovie-news%2Fjr-ntr-emotional-tweet-on-ramoji-rao-death-610852.html

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago