రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. కానీ ఇది రాజకీయపరమైన వైరం కాదే.. కుటుంబపరమైన వైరం. కలతలు వస్తేనే కలవడం కష్టం. అలాంటిది అన్నీ లాగేసి రోడ్డున నిలబెట్టిన అన్నను షర్మిల క్షమించగలదా? తిరిగి అన్నకు అండగా నిలవగలదా? రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చి మాత్రం షర్మిల సాధించిందేముంది? కనీస జనాదరణ పొందారా? కనీసం ఆమె పుట్టిన గడ్డైనా ఆమెను ఆదరించిందా? సొంత గడ్డపై పోటీ చేసి నవ్వుల పాలయ్యారు. కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇంత ఘోర పరాజయం షర్మిలను కదిలించలేకపోవచ్చు కానీ ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ పడినట్టే కదా? పీసీసీ చీఫ్‌గా ఉండి ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటును సాధించలేకపోవడం ఆమె కుటుంబ చరిత్రకే పెద్ద మచ్చ. షర్మిల పగ్గాలు చేపట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 2 కంటే తక్కువకు పడిపోయింది. వైసీపీ దారుణ పరాజయంతో ఆ పార్టీలోని కొందరు నేతలకు మరింత సంకట స్థితి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి వైపు కూడా ఈ నేతలెవరూ చూసే పరిస్థితి లేదు. పోనీ కాంగ్రెస్‌లోకి వెళదామా? అంటే దానికంటే రాజకీయ సన్యాసం బెటరన్న ఆలోచనలో ఉన్నారు.
కుటుంబ చరిత్రకే ఇది అవమానం..
కనీసం ఓట్లకు కూడా షర్మిల గండి కొట్టలేకపోయారు. షర్మిల సాధించింది ఈ ఎన్నికల్లో ఒక్కటే ఒక్కటే కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టి అన్న జగన్‌పై పగ అయితే తీర్చుకోగలిగారు. ఇప్పుడు సమస్య ఏంటంటే.. జగన్ పరిస్థితి కూడా షర్మిలకు ఏమాత్రం తీసిపోదు. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని గర్వంగా కాలర్ ఎగురవేసిన జగన్.. ఐదేళ్లు తిరిగే సరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోయారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. నిజానికి జగన్ కుటుంబ చరిత్రకే ఇది అవమానం. అన్నా చెల్లెళ్లిద్దరూ కుటుంబ చరిత్రను మంటగలిపారు. ఇద్దరూ విడిపోయి సాధించింది ఇంతకు మించి ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఆస్తి కోసం చెల్లిని ఇంటి నుంచి బయటకు గెంటిన జగన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీలవుతారా? చెల్లితో కలిసుంటే తల్లి విజయమ్మ కూడా ఆయనతో ఉండేవారు. ఈ కష్టకాలంలో ఆయనకు కాస్త అండ దొరికేది. జగన్, షర్మిల ఇద్దరూ ఒకే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకరి విలువ మరొకరు తెలుసుకునే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట..
ఇన్నాళ్లు అన్నాచెల్లెల్లిద్దరి మధ్య ఆస్తి గొడవల కారణంగా నేరుగా మాట్లాడుకోవడమే మానేశారు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి షర్మిలకు ఏం కావాలో అది ఇచ్చేయాలని జగన్ అనుకుంటున్నారా? త్వరలో ఆస్తుల పంపకాలు షురూ అవుతాయా? అనే ప్రశ్నలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి అన్నాచెల్లెల్లిద్దరి మధ్య భారతీరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి దూరం పెంచారని టాక్. భారతీ రెడ్డిని పక్కనబెడితే సజ్జలకేంటి ప్రయోజనం అంటారా? నంబర్ గేమ్.. జగన్ తర్వాత తానే నంబర్ 2గా ఉండాలనే ఆరాటం. ఆ ఆరాటంతోనే సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరించి మొత్తానికి పార్టీనే మట్టిలో కలిపేశారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ పాయే… కాంగ్రెస్ పాయే.. మొదలెత్తుకుంటే కానీ ముందుకు జరగదు. ఈ తరుణంలో జగన్ మెడకు కేసుల ఉచ్చు తిరిగి బిగించుకోకా మానదు. మరి జగన్ జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తిరిగి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తీసుకుంటారా? మొత్తానికి జగన్‌కు అయితే ఇప్పుడు తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట. కష్టాలొచ్చేసరికి కన్నవాళ్లు.. తోడబుట్టినది కనిపిస్తున్నారట. మరోవైపు షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ తరుణంలో ఆమె కూడా అన్నే దిక్కు అనుకునే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…