Ranbir Kapoor : బాలీవుడ్ క్యూట్ లవ్ కపుల్ అనగానే గుర్తొచ్చేది రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంట. పెళ్ళయ్యాక వీళ్లిదరు కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్రా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా కోసం సౌత్ లో ప్రచారం కోసం రణ్ బీర్ తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయాడు. ఇక సినిమాను దక్షిణాదిన రాజమౌళి చూసుకుంటున్నారు. అందుకే రణ్ బీర్ తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ప్రమోషన్స్ లో రణ్ బీర్ కు తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది.
మై డార్లింగ్ ప్రభాస్…..
ఇక రణ్ బీర్ ఏ మాత్రం సంశయించకుండా తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసాడు. తెలుగులో అందరు గొప్ప నటులే కానీ నాకు ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ అందుకే అతనంటే చాలా ఇష్టం. అలాగే అభిమానం కూడా అంటూ చెప్పేసాడు. బ్రహ్మాస్త్రా సినిమా విడుదలకు ఇంకా 100 రోజులు ఉంది కానీ అపుడే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 12 న సినిమా అన్ని భాషలలోనూ విడుదల కానుంది.
సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. 2018 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవగా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఇప్పటికి పూర్తయింది. ఇక ఈ సినిమా సమయంలో పరిచయమై, ఆ తరువాత ప్రేమించుకుని ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు ఆలియా, రణ్ బీర్ కపూర్ జంట. బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మరి ఈ సినిమా దక్షిణాది భాషలలో ఎంత ఆదరణ పొందుతుందో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…