Categories: FeaturedMovie News

Rashmi Gowtham : నాన్న ఎఫెక్షన్ ఎపుడు నేను చూడలేదు… శ్రీదేవి డ్రామా కంపెనీలో కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..!

Rashmi Gowtham : ఈటీవీలో జబర్దస్త్ తరువాత అంత క్రేజ్ తెచ్చుకున్న ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్ తో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ జబర్దస్త్ వాళ్ళే వస్తారు. డాన్స్, కామెడీ స్కిట్స్, పాటలు పాడటం ఇలా అన్ని ఉండి సందడిగా ప్రోగ్రామ్ ఉండటంతో టీఆర్పి కూడా బాగా వస్తోంది. సుధీర్ హోస్ట్ గా ఉన్న ఈ షో ప్రస్తుతం జబర్దస్త్ కన్నా మంచి రేటింగ్స్ తో ఉందనే చెప్పాలి. అయితే సుధీర్ ఈ షోనుండి తప్పుకోవడంతో ప్రస్తుతం ఈ షో కి హోస్ట్ గా గత రెండు వారాల నుండి రష్మీ వస్తోంది. రష్మీ యాంకర్ గా వచ్చినా షో రేటింగ్స్ ఏమాత్రం తగ్గడం లేదు.

నాన్న ఎఫెక్షన్ నాకు తెలీదు…

ఇక ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫాదర్స్ డే సెలెబ్రేషన్స్ జరుపుతున్నారు. నాన్న నా హీరో పేరుతో జరగనున్న ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు ఈటీవీ వారు. బుల్లితెర సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు వారి తండ్రులతో షో కి హాజరయ్యారు. బుల్లెట్ భాస్కర్, వాళ్ళ నాన్నతో కలిసి స్కిట్స్ చేసారు. వీధికుక్కలని కాస్త కంట్రోల్ చేయొచ్చుగా అని భాస్కర్ అంటే వాళ్ల నాన్న ఇంట్లో కుక్కనే ఏమి చేయలేక పోతున్నాను, ఇక వీధి కుక్కలను ఏమి తరుముతాను అంటారు.

దానికి భాస్కర్ వెంటనే అంటే నేను కుక్కనా అనగానే అలా అనకు కుక్కలు బాధపడతాయి అని భాస్కర్ వాళ్ళ నాన్న అంటారు. ఇక రష్మీ తన తండ్రి గురించి ఎమోషనల్ అవడం ప్రోమోలో చూపిస్తారు. గుడ్ పేరెంట్, బ్యాడ్ పేరెంట్ ఉంటారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఎలాంటి ఎఫెక్షన్ ను నాన్న నుండి చూడలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక వర్ష మాట్లాడుతూ ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా నాన్న లేని లోటు తీరదని బాధపడింది. ఎమోషనల్ గా ఎండ్ అయిన ఈ ప్రోమో మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇక రష్మీ యాంకర్ గా వచ్చినా ఈ షో రేటింగ్స్ తగ్గకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago