Movie News

Rashmika Mandanna: ‘అజ్ఞానం అందరిపై రుద్దొద్దు’ అంటూ రష్మిక కామెంట్స్‌పై విమర్శలు..

సౌత్ ఇండస్ట్రీలో పాపులారిటీ గల నటి రష్మిక మందన్నా తాజాగా చేసిన ఓ కామెంట్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురి చేసింది. కొడవ సమాజం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన తొలి నటిని తానేనని ఆమె ఇటీవల గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు కోడవ ప్రజల్లోనూ, సినీ ప్రేమికుల్లోనూ ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఆమెకంటే ముందే కొడవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నటీనటులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారనే విషయం చాలామంది గుర్తుచేస్తున్నారు.

Rashmika faces backlash over comments on the Kodava community in Coorg.

రష్మిక చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా నిజానికి విరుద్ధమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. “మీ అజ్ఞానాన్ని అందరిపై రుద్దొద్దు”, “ఇంత త్వరగా మీరు మర్చిపోతారా?”, “తప్పు సమాచారం ఇచ్చి మీను గొప్పవాళ్లలా చూపించుకోవొద్దు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమెకంటే ముందే నటి ప్రేమ, నటుడు గుల్షన్ దేవయ్య లాంటి వారు కొడవ జాతిని ప్రాతినిధ్యం వహిస్తూ ఇండస్ట్రీలో రాణించారని స్పష్టంగా గుర్తుచేశారు.

ఈ వివాదంపై నటి ప్రేమ కూడా స్పందిస్తూ, “ఈ విషయంలో నేను చెప్పేది ఏముంది? కొడవ సమాజానికి నిజం ఏంటో తెలుసు” అని స్పందించారు. అలాగే, “రష్మికకు మేము అందించిన అవకాశాలు, మార్గదర్శకతే ఆమెకు ఈ స్థాయికి తీసుకువచ్చింది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సమాజానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి వచ్చిన ప్రముఖులు, నటీనటులు ఇలా అసత్య ప్రచారాలు చేయడం తగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రష్మిక వ్యాఖ్యలు ఆమెకు తగిన ఫలితాన్ని కాకుండా, ట్రోలింగ్ రూపంలో ప్రతిద్వని ఇచ్చినట్లైంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago