Raviteja: మాస్ మహారాజా రవితేజ్ వరసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. వరసగా ఫ్లాపుల తరువాత క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ’ ఖిలాడీ‘ సినిమా పూర్తిగాకాగా.. ‘ రామారావు అన్ డ్యూటీ’ సినిమాలో నటిస్తున్నారు.
అలాగే త్వరలో ‘రావణాసుర’ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. వీటితో పాటు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నాడు. ఇలా వరసగా బిజీగా ఉన్నాడు రవితేజ.
ఇదిలా ఉంటే మెగాస్టార్ నటించే ఓ సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్నాడు రవితేజ.
చిరంజీవితో కలిసి మాస్ మహారాజ కూడా తెరపై కనిపించబోతున్నాడు. దీంతో అభిమానులకు పండగే ఇక. దర్శకుడు బాబీ డైరెక్షన్ లో మెగా స్టార్ నటిస్తున్నారు. దీనికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారట రవితేజ. రవితేజ పుట్టినరోజు జనవరి 26న ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పడు ఇండస్ట్రీ టాక్ గా మారింది. రోజుకు రూ.25 లక్షల చొప్పున ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. రవితేజ ఈ సినిమా కోసం తక్కువల తక్కువ ఓ ఏడెనిమిది రోజులు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్యామియో రోల్ కి దాదాపుగా కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు రవితేజ. ప్రస్తుతం చిరంజీవి వరసగా సినిమాలు చేస్తున్నారు. గాఢ్ ఫాదర్, బోళాశంకర్ సినిమాలను వరసగా చేస్తున్నారు. దీని తరువాత బాబీ డైరెక్షన్ లో సినిమా ఉండనున్నట్లు టాక్ .
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…