Movie News

Ravi Teja : రవితేజ ఇంట్లో త్రీవ్ర విషాదం..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (వయసు 90) కన్నుమూశారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో రవితేజ ఇంటిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Ravi Teja’s father Rajagopal Raju has passed away.

ఈ వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఉదయం నుంచే పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు రవితేజ నివాసానికి చేరుకుని రాజగోపాల్ రాజు భౌతికకాయాన్ని దర్శించి, చివరి వీడ్కోలు తెలిపారు.

రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రవితేజ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు భరత్ 2017లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో భరత్ మృతి సినీ పరిశ్రమను కలిచివేసింది. ఇప్పుడు ఆయన తండ్రి మృతి కూడా మరోసారి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.

రవితేజ కుటుంబానికి అభిమానులు, సినీ రంగ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో ఆయన కుటుంబానికి శాంతి చేకూరాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

telugudesk

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

4 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

8 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

10 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago