Ray Stevenson: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో స్కాట్ దొర పాత్రలో నటించిన రే స్టీవెన్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కరుడు కట్టిన స్కాట్ దొర పాత్రలో నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. ఇలా తన వీళ్ళ నిజంతో ఎంతో మందిని సంపాదించుకున్న రే స్టీవెన్సన్ హఠాన్మరణం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
స్టీవెన్సన్ మరణంతో త్రిబుల్ ఆర్ టీం కూడా షాక్ కి గురయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.ఇటీవల ‘ క్యాసినో ‘ పాల్గొన్న ఆయన మృతిచెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన మృతికి గల కారణాల గురించి తెలియలేదు. మొదట స్టేజ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన రే స్టీవెన్సన్ ‘ ది థియరీ ఫ్లైట్ ‘ తో వెండితెర మీద రంగప్రవేశం చేసాడు.
ఆ తర్వాత 2004 లో విడుదలైన కింగ్ ఆర్థర్ సినిమాలో డాగోనెట్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత థోర్, స్టార్ వార్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇలా దాదాపు 20 ఏళ్ల పాటు నటుడిగా రాణించిన రే స్టీవెన్సన్ ఇటీవల హఠాన్మరం చెందటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా రే స్టీవెన్సన్ వ్యక్తిగత విషయానికి వస్తే..ఆయన రుత్ గెమ్మెల్ అనే బ్రిటిష్ నటిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఎనిమిదేళ్ళ పాటు సాఫీగా సాగిపోయిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. అందువల్ల వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా రే స్టీవెన్సన్ మరణించడంతో ఆయన మాజీ భార్య తీవ్ర దుఃఖానికి గురైనట్టు తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…