Renu Desai: రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సినీనటిగా అందరికీ ఎంతో సుపరిచితమే అయితే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం పవన్ కళ్యాణ్ పట్ల పలు సందర్భాలలో విమర్శలు కురిపించిన రేణు దేశాయ్ ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల కురిపించడమే కాకుండా తన మద్దతు పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం గురించి కాకుండా వృత్తిపరమైన విషయాలకు వస్తే ఆయన డబ్బు మనిషి కాదని తాను రాజకీయాలలోకి వచ్చినది డబ్బు కోసం కాదని తెలిపారు. పేదల సంక్షేమం కోసమే తాను రాజకీయాలలోకి వచ్చారని రేణు దేశాయ్ తెలిపారు.
తాను తన వ్యక్తిగత విషయాల గురించి కాకుండా ఒక వ్యక్తిలా తనకు రాజకీయపరంగా మొదటి రోజు నుంచి చాలా మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు.పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తిల ఆయనకు మద్దతు తెలుపుతున్నానని అలాగే తనకు ఒక అవకాశం ఇవ్వాలని అందరిని వేడుకున్నారు.
పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల కోసమే కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారని తెలిపారు.తన పిల్లల గురించి మాట్లాడుతూ చాలా మంది పిల్లలను కూడా రాజకీయాలలోకి లాగుతున్నారని ఈమె తెలిపారు. ప్రస్తుతం వారికి వారి చుట్టూ ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు అందుకే తన పిల్లలను దయచేసి రాజకీయాలలోకి లాగొద్దు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్‌కు…