Revanth: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం విజేతగా రేవంత్ ట్రోఫీ అందుకున్నారు. అయితే ట్రోఫీ అందుకున్న అనంతరం నాగార్జున ఓట్ల పరంగా శ్రీహాన్ మొదటి స్థానంలో ఉన్నారని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ నా లేక శ్రీహాన్ నా అని సందేహం ఏర్పడింది.
శ్రీహాన్ 40 లక్షల రూపాయల డబ్బు తీసుకోకుండా ఉండి ఉంటే తప్పకుండా ట్రోఫీ అతనే గెలుచుకునేవాడని అతను 40 లక్షలు డబ్బు తీసుకోవడం వల్ల రేవంత్ విన్నర్ అయ్యారంటూ సోషల్ మీడియాలో కొందరు ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం అనంతరం రేవంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పరోక్షంగా శ్రీహాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తనకు డబ్బు కన్నా పేరే ముఖ్యమని తెలిపారు.పేరు ఉంటే డబ్బు సంపాదించుకోవడం చాలా సులభమని తెలిపారు. ఇలా రేవంత్ మాటల వెనుక శ్రీహాన్ డబ్బుకు ఆశపడి డబ్బు తీసుకున్నారంటూ పరోక్షంగా అతనిపై కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే శ్రీహాంత్ డబ్బు కనుక తీసుకోకపోయి ఉంటే తనే విజేతగా నిలిచేవాడని రేవంత్ రన్నర్ గా మిగిలిపోయే వారని మరికొందరు ఈ విషయం గురించి చర్చిస్తున్నారు.
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ తానేనని మొదటి నుంచి ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నటువంటి రేవంత్ కు అసలైన విజయాన్ని శ్రీహాన్ అందించారని, శ్రీహాన్ ఫాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలేలో ఒకరు 40 లక్షలు మరొకరు ట్రోఫీ అందుకోవడంతో వీరిద్దరూ కూడా విజేతలేనని నాగార్జున ప్రకటించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…