Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపు మేరకు చివరికి ఈ సీఎం రేసు నుంచి ఉత్తమ్ రెడ్డి బట్టి విక్రమార్క తప్పుకోవడంతో ఆ అవకాశం రేవంత్ రెడ్డిని వరించింది అని చెప్పాలి. ఇక ఈయన ముఖ్యమంత్రిగా నిన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం కూడా చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా ఎలాంటి పొలిటికల్ నేపథ్యం లేకుండా స్టూడెంట్ లీడర్ గా ఉన్నటువంటి ఈయన అనంతరం జడ్పిటిసి గాను ఎంపీగాను కొనసాగుతూ రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగారు. ఇలా రాజకీయాల్లో కొనసాగుతూ నేడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం తన కుటుంబం గురించి అలాగే తన భార్య పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ముఖ్యమంత్రిగా తెలంగాణ బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి నామినేషన్ సమయంలో అఫీడవిట్లో తన ఆస్తిపాస్తుల వివరాలను తెలియజేశారు.

30 కోట్ల ఆస్తిపాస్తులు..

రేవంత్ రెడ్డి తన ఆస్తి మొత్తం విలువ 30,95,52,652 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. తన దగ్గర ఐదు లక్షల 34 వేల నగదుతో పాటు ఆయన భార్య గీతారెడ్డి దగ్గర 1235 గ్రాముల బంగారం విలువ 83,36,000 ఉన్నాయట. అలాగే 7,17,800 విలువచేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయట. వెండి 9,700 గ్రాముల వరకు ఉన్నట్టు సమాచారం.రేవంత్ రెడ్డి ఆయన భార్య దగ్గర పేరు మీద ఉన్న అప్పు 1,30,19,901 ఉందని తెలుస్తుంది. ఇక వీరికి ఒక మెర్సిడెజ్ బెంజ్ కార్, హోండా సిటీ ఉన్నాయి.ఇక రేవంత్ రెడ్డి దగ్గర 50,000 ఖరీదు చేసే రైఫిల్. రెండు లక్షల ఖరీదు చేసే పిస్టల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సమాచారం మొత్తం రేవంత్ రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

23 minutes ago

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

38 minutes ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

58 minutes ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

1 hour ago

ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఈ నెంబర్ వెంటనే సేవ్ చేసుకోండి!

ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…

2 hours ago

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

2 hours ago