సంచలనమైన నిర్ణయాలు, సెన్సేషనల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అంటే అతిశయోక్తి కాదు. ఫ్యాన్స్ లో వర్మ అంటే క్రేజ్ పెరగడానికి గల కారణం వర్మ దేని గురింనైనా ఎవరి గురించైనా కుండ బ్రద్ధలు కొట్టినట్టు మాట్లాడటం అతని స్టైల్. తన మనసుకు ఏదనినిపిస్తే అది చెప్పేస్తాడు. తన మనసుకు నచ్చిందే చేస్తానంటాడు. అందుకే సోషల్ మీడియాలో వర్మ చుట్టూ వివాదాలు తిరుగుతూనే వుంటాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అంటే వర్మ ఎప్పటినుంచో సరిగ్గా పడదు. ఈ నేపధ్యంలో చిరు, పవన్ పై ఇప్పటికే పలు సార్లు వివాదాస్పద ట్వీట్స్ చేసారు వర్మ. ఇక పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సినిమాలు సినిమాలు తీయడం మరింత వివాదాస్పదం అయ్యాయి.
వర్మ కావాలనే పవన్ కళ్యాన్ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి చుస్తున్నాదంటూ ఫాన్స్ రెచ్చిపోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో పలు సార్లు వర్మపై మెగా ఫ్యాన్స్ దాడి కూడా జరిగింది. అయితే గడచిన కొన్నాళ్లుగా ఎందుకో మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు వర్మ.. అయితే తాజగా మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్స్ తో ఫాన్స్ కి చిర్రెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.
అసలు విషయానికి వస్తే.. ఇటీవలే ఆగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చిరు కుటుంబ సభ్యులు, మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటూ నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాలేదు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. చిరు బర్త్ డే వేడుకలకు బన్నీ ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ కు బన్నీ విష్ చేసారు కానీ వేడుకలలో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ పలు రకాలు ప్రచారాలు మొదలయ్యాయి.
ఇక ఈ విషయం పై వర్మ తనదైన శైలిలో రెచ్చిపోయారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. “చిరంజీవి తమ్ముళ్లు, కొడుకులు, మేనల్లుళ్ళు గా కంటే అల్లు రామలింగయ్య మనవడి హోదాలో స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ దే నిజమైన సక్సెస్” అంటూ ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా కాసేపటికి మరో ట్వీట్ లో.. “చిరంజీవి మేనల్లుడుగా కాకుండా ఆయనే స్వయంగా స్టార్ గా ఎదిగినట్టుగా అల్లు అర్జున్ భావిస్తున్నాడు. అందువల్లే మిగత మెగా హీరోలు అందరూ చిరంజీవి బర్త్ డే వేడుకలకు హాజరైనా బన్నీ మాత్రం హాజరుకాలేదు” అంటూ కామెంట్ చేశారు. ఇక మూడవ ట్వీట్ గా వర్మ “ఒరిజినల్ మెగాస్టార్ చిరంజీవి తరువాత ప్రజెంట్ మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమే” అంటూ తనదైన శైలిలో వివాదం రేపాడు. ఇక వర్మ చేసిన తాజా ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మెగా ఫ్యామిలీలో ఎదిగిన అల్లు అర్జున్ ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన స్వయం కృషి, అల్లు రామలింగయ్య వారసత్వం మాత్రమే.. అంతేగానీ చిరంజీవి అతను స్టార్ కాలేదంటూ వర్మ పరోక్షంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. అల్లు అర్జున్ కూడా అలానే భావిస్తున్నారని వర్మ ట్వీట్స్ ద్వారా అభిప్రాయ పడటం. ఇక పొతే అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి కంటే ముందే అల్లు వారి సినీ ప్రస్థానం మొదలైంది.. ఇక అల్లు అర్జున్ కూడా మెగా హీరో బ్రాండ్ కంటే అల్లు అర్జున్ మనవడిగానే గుర్తింపు రావడం ఇష్టపదతారనే వార్తలు గతంలో కూడా రావడం జరిగింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…